News August 2, 2024
CBN ఆలోచనలను YSR అమలు చేశారు: CM రేవంత్

TG: YSR, చంద్రబాబుకు రాజకీయపరంగా భిన్నాభిప్రాయాలుండేవని, అయినా చంద్రబాబు HYD కోసం చేసిన ఆలోచనలను YSR విస్తరించి అమలు చేశారని CM రేవంత్ అన్నారు. ‘‘హైదరబాద్ కోసం మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డును YSR నిర్మిస్తే దాన్ని తాకట్టుపెట్టి, పారిపోయిన సన్నాసులు ‘కాంగ్రెస్ ఏం చేసిందని’ ప్రశ్నిస్తారా?’’ అని అసెంబ్లీలో రేవంత్ BRSపై మండిపడ్డారు.
Similar News
News July 7, 2025
ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.
News July 7, 2025
రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.
News July 7, 2025
గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్‌కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్‌గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్‌కు ఓటమి రుచి చూపించారు.