News September 30, 2024

CBN హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ట్రెండింగ్

image

తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు AP CM చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తవ్వకముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ‘CBN Should Apologize Hindus’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, హిందువులందరూ CBNని క్షమాపణ అడుగుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

Similar News

News October 5, 2024

నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి

image

వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News October 5, 2024

ఆరోజున ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ వెల్లువ?

image

ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నుంచి టీజర్, హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్, కల్కి-2 నుంచి అప్‌డేట్, సందీప్ వంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు డార్లింగ్, ఈశ్వర్ మూవీస్ రీ-రిలీజ్ ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు రెబల్ ఫ్యాన్స్‌.

News October 5, 2024

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

image

TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.