News January 1, 2025
పథకాలను మింగేసిన CBN, పవన్: వైసీపీ

AP: CM చంద్రబాబు, Dy.CM పవన్ అన్ని పథకాలను మింగేసి కొండచిలువలా సైలెంటుగా ఉంటున్నారని YCP విమర్శించింది. బాబు రూ.కోట్లకు పడగలెత్తి ప్రజలను రోడ్డున పడేశారని దుయ్యబట్టింది. ‘సంవత్సరం మారింది.. సూపర్ సిక్స్ ఏదీ? విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు. రైతన్నలకు భరోసా కరవు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించదు. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై పెనుభారం మోపారు’ అని ఫైరయ్యింది.
Similar News
News October 19, 2025
సిద్దిపేట: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు !

ఉమ్మడి మెదక్ జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా కాల్చే కాకర పుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కో దాని కుల్ల ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మి, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాకాయలు ధరలు ఎక్కువగానే ఉన్నాయి.
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు ఏ నూనె ఉత్తమం?

దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ‘ఆవు నెయ్యి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ నూనె దుష్ఫలితాలు కలగనివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దాంపత్యం అన్యోన్యం అవుతుంది. ఆవు నెయ్యిలో వేప నూనె కలిపి వెలిగిస్తే విజయం లభిస్తుంది. అయితే వేరుశెనగ నూనె వాడకూడదు’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే జరిమానా: ఈసీ

ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని యాజమాన్యాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకూ ఇది వర్తిస్తుందని, ఎవరి వేతనాల్లోనూ కోత విధించరాదని సూచించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలింగ్ రోజు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని చెప్పింది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాలంది.