News January 1, 2025

పథకాలను మింగేసిన CBN, పవన్: వైసీపీ

image

AP: CM చంద్రబాబు, Dy.CM పవన్ అన్ని పథకాలను మింగేసి కొండచిలువలా సైలెంటుగా ఉంటున్నారని YCP విమర్శించింది. బాబు రూ.కోట్లకు పడగలెత్తి ప్రజలను రోడ్డున పడేశారని దుయ్యబట్టింది. ‘సంవత్సరం మారింది.. సూపర్ సిక్స్ ఏదీ? విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు. రైతన్నలకు భరోసా కరవు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించదు. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై పెనుభారం మోపారు’ అని ఫైరయ్యింది.

Similar News

News January 22, 2025

పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

image

పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 12-30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామన్నారు. కలుషితమైన నీరు/ఆహారం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాన్సుందని డాక్టర్లు చెబుతున్నారు.

News January 22, 2025

గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే!

image

కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని డాక్టర్లు తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.

News January 22, 2025

మెట్రో, రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం: సీఎం

image

ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు HYDలో ఉండాలని కోరుకుంటున్నామని CM రేవంత్ అన్నారు. దావోస్‌లో WEF, CII, హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘HYDలో దాదాపు 100 కి.మీ.కు పైగా కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తున్నాం. ORR బయట 360 కి.మీ ప్రాంతీయ రింగ్ రోడ్డు, ఈ రెండింటిని కలుపుతూ రేడియల్ రోడ్లు వేస్తాం. రింగ్ రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచనలున్నాయి’ అని తెలిపారు.