News June 12, 2024
CBN: 1995లో తోడల్లుడు.. 2024లో వదిన!

AP: TDP చీఫ్ చంద్రబాబు ఇవాళ నాలుగోసారి CMగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తొలిసారి 1995లో చంద్రబాబును TDP శాసనసభాపక్ష నేతగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. మళ్లీ ఇప్పుడు 2024లో NDA శాసనసభాపక్ష నేతగా CBNను ఆయన వదిన దగ్గుబాటి పురందీశ్వరి బలపరిచారు. నిన్న జరిగిన TDP సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. కాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి దంపతులు అనే విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2025
2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.
News March 19, 2025
రికార్డు దిశగా గోల్డ్ ధరలు!

బంగారం ధరలు పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,440కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.
News March 19, 2025
వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.