News August 28, 2024
రిలయన్స్, డిస్నీ విలీనానికి సీసీఐ ఆమోదం
కొన్ని మార్పులకు లోబడి రిలయన్స్ మీడియా వ్యాపారం, డిస్నీ ఇండియా విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. రిలయన్స్ 47వ ఏజీఎంకు ముందే తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రూ.70,350 కోట్ల విలువైన సరికొత్త జాయింట్ వెంచర్‌కు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో రిలయన్స్‌కు 16.34, వయాకామ్ 18కు 46.82, డిస్నీకి 36.84% వాటాలు ఉంటాయి.
Similar News
News September 13, 2024
బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE) ప్రాజెక్టులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. షార్ట్ సెల్లర్లకు ఇది లక్ష్యంగా మారొచ్చని హెచ్చరించారు. ‘లోన్‌బుక్స్‌లో అధిక CRE రేషియో వల్ల అంచనా వేయగలిగే, వేయలేని CRE నష్టాలతో బ్యాంకులకు ఇబ్బందే. వీటితో లిక్విడిటీ ఆగిపోతే షార్ట్ సెల్లర్లు టార్గెట్ చేస్తారు. దాంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత తగ్గుతుంది’ అని అన్నారు.
News September 13, 2024
‘మత్తు వదలరా-2’ సినిమా రివ్యూ
మర్డర్ కేసులో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. తన కామెడీ టైమింగ్‌తో సత్య ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ప్లస్ పాయింట్లు. సాగదీత సీన్లు, రొటీన్ అంశాలు మైనస్. డైరెక్టర్ కామెడీపై పెట్టిన ఫోకస్ ఇంకాస్త స్టోరీపై పెట్టుంటే బాగుండేది. కామెడీని ఇష్టపడే వారికి నచ్చుతుంది. రేటింగ్ 2.5/5.
News September 13, 2024
టీమ్‌ఇండియా ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త బౌలింగ్ కోచ్
బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. కొత్త బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ కూడా జట్టులో చేరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈనెల 19-23 వరకు తొలి టెస్ట్, ఈనెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.