News February 9, 2025
CCL: తెలుగు వారియర్స్ ఓటమి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.
Similar News
News March 28, 2025
భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 28, 2025
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం