News October 2, 2024
గాజాతో CEASE FIRE ఔట్ ఆఫ్ క్వశ్చన్: డిఫెన్స్ ఎక్స్‌పర్ట్
వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ యోసి కుపర్‌వాసర్ అన్నారు. ఈ టైమ్‌లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్‌పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్‌లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్‌ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.
Similar News
News October 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 14, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు
News October 14, 2024
ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతివృత్తం
పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్‌లు దీనిని క్యాలెండర్ సర్కిల్‌గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.