News March 25, 2024

‘సెలబ్రిటీ’ హోలీ

image

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ సరదాగా గడిపారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా హోలీ ఆడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన భర్త నికోలస్‌తో పండుగ జరుపుకున్నారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర & రకుల్ దంపతులు, తన పెట్స్‌తో సమంత తదితరుల సెలబ్రేషన్ ఫొటోస్ మీకోసం.

Similar News

News November 11, 2024

రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యంగా పడుకుంటే మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతారు. డయాబెటిస్‌ బారిన పడతారు. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి తరచూ జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. మహిళలకు హార్మోన్ల బ్యాలెన్స్ తప్పి పీరియడ్స్ సరిగ్గా రావని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News November 11, 2024

IPLలో ధోనీలాగే ఆండర్సన్‌ కూడా: డివిలియర్స్

image

IPL వేలానికి ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ తన పేరు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూస్తే 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా IPL ఆడుతున్న ధోనీ గుర్తొస్తున్నారని ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. ‘42 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఒకప్పటిలా బౌలింగ్ చేయలేకపోవచ్చు. బేస్‌ ప్రైజ్‌కి మించి అమ్ముడుకాకపోవచ్చు. కానీ యువ ఆటగాళ్లకు అతడి అనుభవం ఓ వరం. నేనే జట్టు ఓనర్‌నైతే కచ్చితంగా ఆండర్సన్‌ను కొంటా’ అని పేర్కొన్నారు.

News November 10, 2024

మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారు: రోజా

image

AP: కాకినాడ(D) తొండంగి(M) ఆనూరులో మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ బెల్టు షాపు వైన్స్‌ను తలదన్నేలా ఉందన్నారు. ‘TDP మేధావి యనమల రామకృష్ణుడి సొంత మండలం, హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో ఈ షాపు ఉంది. బెల్టు షాపు కనిపిస్తే బెల్టు తీస్తానన్న CM CBN కోసమే దీనిని పోస్ట్ చేశా. మంచి ప్రభుత్వమంటే ఇదేనా పవన్ కళ్యాణ్? సిగ్గుచేటు’ అని Xలో వీడియో పోస్ట్ చేశారు.