News October 27, 2024
నవంబర్ 4 నుంచి తెలంగాణలో కులగణన
నవంబర్ 4 నుంచి తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 80వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనుండగా, NOV 19 వరకు ఇది కొనసాగుతుంది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో ఫార్మాట్ రూపొందించారు. ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, ధరణి, రాజకీయ నేపథ్యం, బ్యాంక్ ఖాతా సహా మరిన్ని వివరాలు సేకరిస్తారు.
Similar News
News November 2, 2024
జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి
TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
News November 2, 2024
మళ్లీ అల్పపీడనం.. 7 నుంచి భారీ వర్షాలు
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
News November 2, 2024
UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు
వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ట్రాన్సాక్షన్ల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ రూ.23.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు NPCI వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక నెలలో ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 45 శాతం, విలువపరంగా 34 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. రోజువారీ లావాదేవీలు 535 మిలియన్లుగా నమోదైనట్లు వివరించింది.