News September 6, 2024

కేంద్రం సాయం చేస్తుంది: బండి సంజయ్

image

వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వద్ద NDRF నిధులు రూ.1,345కోట్లు ఉన్నాయని, గత ప్రభుత్వం ఈ నిధులను వాడుకోలేకపోయిందని ఆయన విమర్శించారు.

Similar News

News October 12, 2024

ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 12, 2024

లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!

image

అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 12, 2024

అమ్మవారికి తల సమర్పించేందుకు భక్తుడి యత్నం!

image

దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.