News September 5, 2024

కేంద్రం సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్ సింగ్ చౌహాన్

image

AP: భారీ వరదలతో విజయవాడ అతలాకుతలమైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఏపీకి త్వరగా కేంద్రం నుంచి సాయం అందేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ‘రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మోదీకి వివరిస్తా. ఐదురోజులపాటు విజయవాడ వాసులు నీటిలోనే ఉండిపోయారు. సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు కృషి అభినందనీయం. డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించడం భేష్’ అని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News September 16, 2024

సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

✒ 1916: ప్రముఖ గాయని MS సుబ్బలక్ష్మి జననం
✒ 1923: సింగపూర్ జాతి పిత లీ క్వాన్‌ యూ జననం
✒ 1959: ప్రముఖ నటి రోజా రమణి జననం
✒ 1975: నటి మీనా జననం
✒ 2012: హాస్య నటుడు సుత్తివేలు మరణం
✒ 2016: హేతువాది. పౌరహక్కుల నేత బొజ్జా తారకం మరణం
✒ 2019: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం
✒ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

News September 16, 2024

షేక్ హసీనాపై 136 హత్యా కేసులు నమోదు

image

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. తాజాగా ఓ విద్యార్థి హత్యకు సంబంధించి ఆమెపై కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఆమెపై 155 కేసులు నమోదవగా, అందులో 136 హత్యా కేసులే. ఇటు హసీనా GOVTకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 1000 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

News September 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.