News August 24, 2024
ఏపీకి ఇచ్చే రుణంలో కేంద్రం కొత్త మెలిక?
AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించే నిధుల నుంచి విడతలవారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏటా బడ్జెట్లో ఆ మినహాయింపును చూపించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరావతికి కేంద్రం రూ.3వేల కోట్లను మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో రాజధాని రైతులకు సర్కారు వచ్చే నెలలో కౌలు చెల్లించే అవకాశం ఉంది.
Similar News
News September 10, 2024
పారాలింపిక్స్ ‘గోల్డ్’ విజేతలకు రూ.75 లక్షలు: మాండవీయ
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులకు ₹75 లక్షలు, సిల్వర్ విజేతలకు ₹50 లక్షలు, బ్రాంజ్ పతకాలు సాధించిన వారికి ₹30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో రాణించిన ప్లేయర్లకు ₹22.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. 2028 పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
News September 10, 2024
PAC మీటింగ్‌లో సెబీ చీఫ్‌పై BJP vs TMC
పార్లమెంట్ PAC మీటింగ్‌లో సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై BJP, TMC మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమెను కమిటీ ముందుకు పిలిపించాలని సౌగతా రాయ్ చేసిన డిమాండ్‌ను నిశికాంత్ దూబే (BJP) వ్యతిరేకించారు. కేంద్రం ఆదేశించకుండా కాగ్ ప్రిన్సిపల్ ఆడిటర్ సెబీ ఖాతాలను ఆడిట్ చేయలేరన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అవకతవకలపై పక్కా ఆధారాలు లేకుండా పీఏసీ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించలేదన్నారు.
News September 10, 2024
ODI హిస్టరీలో తొలి ‘డబుల్ సెంచరీ’ ఎవరిదో తెలుసా?
ODI క్రికెట్‌లో ‘డబుల్ సెంచరీ’ అనగానే సచిన్, రోహిత్ గుర్తుకొస్తారు. సచిన్ 2010లో తొలిసారి 200* రన్స్ బాదారు. కానీ అంతకు 13ఏళ్ల ముందే ఆసీస్ మహిళా క్రికెటర్ బిలిందా క్లార్క్ 229* పరుగులు చేశారు. ODI క్రికెట్ హిస్టరీలో ఇదే తొలి డబుల్ సెంచరీ. ముంబై వేదికగా జరిగిన 1997 WCలో డెన్మార్క్‌పై ఈ ఫీట్ నమోదుచేశారు. ఆమె 54వ పుట్టినరోజు నేడు. ఈ ప్లేయర్ 118 వన్డేల్లో 4,844 రన్స్, 15 టెస్టుల్లో 919 రన్స్ చేశారు.