News December 3, 2024

కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం స్పందన

image

AP: విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైందని జనసేన ఎంపీ బాలశౌరి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ అంశం తమ ముందు లేదని కేంద్రమంత్రి కుమారస్వామి బదులిచ్చారు. ఒకవేళ ప్రతిపాదన వస్తే దీన్ని పరిశీలిస్తామని స్వామి సభలో సమాధానం ఇచ్చారు. కేంద్రమంత్రి సమాధానంతో కడప స్టీల్ ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Similar News

News January 23, 2025

స్వదేశానికి పయనమైన చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్ నుంచి స్వదేశానికి పయనమయ్యారు. మూడు రోజులకు పైగా సాగిన పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి మెర్‌ఎస్కే వంటి సంస్థలతో ఆయన బృందంతో కలిసి చర్చలు జరిపారు. కాగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు.

News January 23, 2025

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు

image

FEB 1 నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.32500 వరకు పెంపు ఉంటుందని తెలిపింది. ముడిసరుకులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంది. వ్యాగన్ Rపై రూ.13000, బ్రెజాపై రూ.20వేలు, ఎర్టిగాపై రూ.15వేలు, స్విఫ్ట్‌పై రూ.5వేలు, ఆల్టో K10పై రూ.19500, బలెనోపై రూ.9వేలు, గ్రాండ్ విటారాపై రూ.25వేల వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది.

News January 23, 2025

రోహిత్ చివరి 17 ఇన్నింగ్సుల స్కోర్లు ఇవే

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిరోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ (3) దారుణంగా విఫలమయ్యారు. చివరి 17 ఇన్నింగ్సు(అన్ని ఫార్మాట్లు)ల్లో ఆయన ఒకే ఒక ఫిఫ్టీ సాధించారు. ఐదు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేశారు. 17 ఇన్నింగ్సుల్లో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 3, 6, 10, 3, 9, 3 పరుగులు చేశారు.