News June 22, 2024

జనాభా ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ కేటాయింపులుండాలి: భట్టి

image

TG: కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రానికి కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాది ఈ విభాగంలో 1.4% నిధులే వచ్చాయన్నారు. ‘జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఉపాధి హామీ నిధులను ఆస్తుల సృష్టి పనులకు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. TGలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి’ అని కోరామన్నారు.

Similar News

News November 13, 2024

PHOTOS: పెర్త్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ ఆరంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ Xలో పోస్ట్ చేసింది. తొలి టెస్ట్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి.

News November 13, 2024

నామినేషన్ దాఖలు చేసిన RRR

image

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.

News November 13, 2024

ఎల్లుండి నుంచి ICICI క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

image

* క్యాష్ అడ్వాన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు 3.75%
* రూ.101-500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.100
* రూ.50వేల పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.1300
* రూ.100లోపు బిల్లు విషయంలో ఎలాంటి లేట్ ఫీజు ఉండదు
* ఎడ్యుకేషన్ విషయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులకు 1% ఛార్జీ వర్తింపు
* స్కూల్/కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.