News April 10, 2025

కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

image

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

Similar News

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News April 16, 2026

10-20% పెరగనున్న మందుల ధరలు?

image

క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని నేషనల్ మీడియా పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ముడిపదార్థాల రవాణాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు కోరినట్లు తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు తాత్కాలికంగా 3 నెలలు వరకు మాత్రమే ఉంటుందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ధరలు తగ్గిస్తారని సమాచారం.

News April 16, 2026

రాబోయే 2 గంటల్లో వర్షం

image

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.