News November 29, 2024
కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడింది: కాంగ్రెస్
పార్లమెంటు సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నా కేంద్రం ఎందుకు సభను నియంత్రించడం లేదన్నది మిస్టరీగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అదానీ వ్యవహారం, మణిపుర్, సంభల్ అల్లర్లు, ఢిల్లీలో శాంతిభద్రతల అంశాలపై సభలో విపక్షాల ఆందోళనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశాల్లో విమర్శలకు బాధ్యత వహించాలన్న భావనతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిందని విమర్శించారు.
Similar News
News November 29, 2024
రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం: పవన్
AP: బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని Dy.CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ.73 చొప్పున విదేశాలకు అమ్ముతూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 29, 2024
ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.
News November 29, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ
TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.