News November 29, 2024
కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది: కాంగ్రెస్
పార్లమెంటు సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నా కేంద్రం ఎందుకు సభను నియంత్రించడం లేదన్నది మిస్టరీగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అదానీ వ్యవహారం, మణిపుర్, సంభల్ అల్లర్లు, ఢిల్లీలో శాంతిభద్రతల అంశాలపై సభలో విపక్షాల ఆందోళనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశాల్లో విమర్శలకు బాధ్యత వహించాలన్న భావనతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని విమర్శించారు.
Similar News
News December 14, 2024
అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు నిరాశ
అల్లు అర్జున్ రేపు ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.
News December 14, 2024
అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.
News December 14, 2024
ఆధార్ కార్డు ఉన్న వారికి ALERT
పదేళ్లుగా ఆధార్ వివరాలు మార్చని వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం రేపటి(డిసెంబర్ 14)తో ముగియనుంది. ఎల్లుండి నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు UIDAI గడువు పొడిగించగా, మరోసారి పెంచుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మైఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్‌డేట్ చేసుకోవచ్చు.