News October 24, 2024
ఎన్డీయేలోని కీలక రాష్ట్రాలకు కేంద్రం రైల్వే కానుకలు

NDAలో కీలక భాగస్వాములైన ఏపీ, బిహార్లకు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమరావతి లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News December 31, 2025
శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు

AP: కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. CCTV ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన ఓ యువకుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకుడితో జరిగిన వ్యక్తిగత వివాదం కారణంగానే శివ లింగం ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కూడా సీరియస్ అయ్యారు.
News December 31, 2025
‘ధురంధర్’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.
News December 31, 2025
25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్సైట్: ssc.gov.in


