News October 24, 2024

ఎన్డీయేలోని కీల‌క రాష్ట్రాల‌కు కేంద్రం రైల్వే కానుక‌లు

image

NDAలో కీల‌క భాగ‌స్వాములైన ఏపీ, బిహార్‌ల‌కు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమ‌రావ‌తి లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్‌కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News November 12, 2024

FLASH: హాల్‌టికెట్లు విడుదల

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <>https://ssc.gov.in/<<>> వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,712 గ్రూప్-C ఉద్యోగాల(లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్)కు ఈ నెల 18న రెండు సెషన్లలో ఆన్‌లైన్ పరీక్ష జరగనుంది.

News November 12, 2024

తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది: KTR

image

TG: మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు.

News November 12, 2024

గోవాలో మినీ ‘సిలికాన్ వ్యాలీ’: పీయూష్

image

గోవాను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపించే గోవా చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఉన్న 23 పారిశ్రామిక ప్రాంతాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి’ అని గుర్తుచేశారు. సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్ పరిశ్రమలకు గోవాను కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.