News August 29, 2024
ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: AEE(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుంచి HYD జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీజోన్ సివిల్ ఇంజినీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు ఇరిగేషన్ శాఖ HRMS పోర్టల్‌లో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News December 27, 2025
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.
News December 27, 2025
ఉపవాసంలో ఉపశమనం కోసం..

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.
News December 27, 2025
RBIలో 93 పోస్టులు.. అప్లై చేశారా?

ఆర్బీఐలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ, రిస్క్ మేనేజ్మెంట్ నిపుణులకు గుడ్ న్యూస్. <


