News August 29, 2024

ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: AEE(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుంచి HYD జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీజోన్ సివిల్ ఇంజినీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు ఇరిగేషన్ శాఖ HRMS పోర్టల్‌లో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News February 20, 2025

Beautiful Photo: రోహిత్ ఖుషీ.. టీమ్ జోష్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు బంగ్లాతో తలపడేందుకు భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించింది. ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో జట్టు ఆటగాళ్లంతా రోహిత్ చుట్టూ చేరి నవ్వుతూ కనిపించారు. రోహిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులు హిట్‌మ్యాన్‌పై చూపే ప్రేమ, ఆప్యాయతకు ఇది నిదర్శమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News February 20, 2025

రాత్రిపూట వీటిని తింటున్నారా?

image

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

News February 19, 2025

TGలో త్వరలో ఉప ఎన్నికలు: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

error: Content is protected !!