News January 27, 2025
ఫిబ్రవరి 3న ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు

APలో పలు మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 30లోగా సమావేశం ఏర్పాటు చేయాలని, FEB 3న ఎన్నిక జరపాలని ఆదేశించింది. TPTY, NLR, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండలో ఛైర్‌పర్సన్, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి.
Similar News
News February 17, 2025
ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ: సీఎం

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.
News February 17, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసేది ఎవరంటే?: క్లార్క్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.
News February 17, 2025
ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.