News August 11, 2024
చైతూ ఎంగేజ్‌మెంట్.. డీపీ మార్చిన నాగ్
రెండు రోజుల కిందట నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ అయింది. ఈ విషయాన్ని తొలుత చైతూ తండ్రి నాగార్జునే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆయన తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ డీపీ మార్చారు. ఎంగేజ్‌మెంట్‌లో చైతూ-శోభితతో పాటు అమల, అఖిల్‌తో కలిసి ఆయన దిగిన ఫొటోను నాగ్ డీపీగా పెట్టుకున్నారు. దీంతో ‘సూపర్ ఫ్యామిలీ’ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 8, 2024
‘ఎమర్జెన్సీ’కి U/A సర్టిఫికెట్.. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశం
బాలీవుడ్ నటి కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో బోర్డు సర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. తాజాగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్‌క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
News September 8, 2024
భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
News September 8, 2024
మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!
పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.