News February 20, 2025
చైతూ ‘హారర్ థ్రిల్లర్’.. మార్చి నెలాఖరు నుంచి షురూ?

‘తండేల్’ సక్సెస్‌తో జోరుమీదున్న నాగ చైతన్య కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. కార్తీక్ దండు డైరెక్షన్‌లో మార్చి నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ స్క్రీన్‌ప్లేపై సుకుమార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్లు టాక్.
Similar News
News March 26, 2025
IPL-2025: KKR టార్గెట్ ఎంతంటే?

గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌లో KKRపై RR 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ 30+ పరుగులు చేయకపోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా కదిలింది. హసరంగా(4)ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం వర్కౌట్ అవ్వలేదు. జురెల్ 33 పరుగులతో రాణించారు. చివర్లో ఆర్చర్ 2 సిక్సులతో మెరిశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 152 పరుగులు.
News March 26, 2025
మా జోలికి వస్తే ఎవరినైనా వదలబోం: నాటో

పోలాండ్ సహా అన్ని సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని అనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్న వేళ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News March 26, 2025
త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.