News September 21, 2024

దాని కోసం చైతూ అన్నీ వదిలేశారు: బన్నీ వాసు

image

‘తండేల్’ చిత్రం కోసం హీరో నాగచైతన్య అన్నీ వదిలేశారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నాగార్జున అబ్బాయిని అనే ఫీలింగ్ లేకుండా రాజు అనే పాత్ర కోసం సాధారణ స్థాయికి వెళ్లారని చెప్పారు. కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యేందుకు వారిలాగే ఉంటున్నారని చెప్పారు. ఇది వరకూ చైతన్య వేరని ఇప్పుడు వేరని పేర్కొన్నారు. కాగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News November 5, 2025

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతంగా పనిచేసే క్యాన్సర్ ఔషధం!

image

నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (US) సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.

News November 5, 2025

కోతుల మధ్య కూర్చుంటే యోగిని ఎవరూ గుర్తించరు: అఖిలేశ్

image

బిహార్ ప్రచారంలో UP CM యోగి ఆదిత్యనాథ్‌ ‘మూడు కోతుల’ వ్యాఖ్యలకు SP చీఫ్ అఖిలేశ్ కౌంటరిచ్చారు. ‘ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించడానికి BJP 3 కోతుల సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుంటోంది. నిజానికి ఆదిత్యనాథ్ కోతుల గుంపులో కూర్చుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేరు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్, తేజస్వి, అఖిలేశ్‌లను యోగి 3 కోతులతో పోల్చి <<18187731>>విమర్శించిన<<>> విషయం తెలిసిందే.

News November 5, 2025

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌( NHSRC) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, MBA, MBBS, BDS, నర్సింగ్, BHMS, BAMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: nhsrcindia.org/