News September 21, 2024

దాని కోసం చైతూ అన్నీ వదిలేశారు: బన్నీ వాసు

image

‘తండేల్’ చిత్రం కోసం హీరో నాగచైతన్య అన్నీ వదిలేశారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నాగార్జున అబ్బాయిని అనే ఫీలింగ్ లేకుండా రాజు అనే పాత్ర కోసం సాధారణ స్థాయికి వెళ్లారని చెప్పారు. కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యేందుకు వారిలాగే ఉంటున్నారని చెప్పారు. ఇది వరకూ చైతన్య వేరని ఇప్పుడు వేరని పేర్కొన్నారు. కాగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News December 11, 2025

పిల్లలకు SM బ్యాన్ చేయాలి: సోనూసూద్

image

AUS తరహాలో INDలోనూ U16 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటుడు సోనూసూద్ కూడా ఇదే విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. పిల్లలు స్క్రీన్ అడిక్షన్‌కు దూరమై నిజమైన బాల్యాన్ని గడపాలని, కుటుంబ బంధాలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పేరెంట్స్ ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలెలా మారుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News December 11, 2025

ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

image

ESIC పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 11, 2025

పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో పిల్లల్ని పెంచడం అనేది కత్తిమీద సాములా మారింది. కొందరు తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తుంటే.. మరికొందరు అతి క్రమశిక్షణతో పంజరంలో పక్షుల్లా పెంచుతున్నారు. ఈ రెండు విధానాల వల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. వారికి ముఖ్యంగా పరోపకార గుణం, యాంగర్ మేనేజ్‌మెంట్, గౌరవం, ప్రేమానురాగాలు, బాధ్యత, కార్యదక్షత, తప్పును అంగీకరించడం, సమయపాలన నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.