News March 8, 2025
హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న చైతూ-శోభిత

టాలీవుడ్ హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవి చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా చైతూ నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కార్తీక్ వర్మ దండుతో మరో మూవీ చేయనున్నారు. మరోవైపు శోభిత కూడా పలు మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.
Similar News
News March 24, 2025
అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్‌పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.
News March 24, 2025
రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే డకౌట్

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ డకౌటయ్యారు. ఈ టోర్నీలోనే అత్యధిక ధర(రూ.27కోట్లు) వెచ్చించి ఆయనను కొనుగోలు చేశారు. తొలి మ్యాచులో 6 బంతులు ఎదుర్కొన్న ఆయన సున్నాకే వెనుదిరిగారు. దీంతో రూ.27 కోట్లు పెడితే ఇలాగేనా ఆడేది అని పలువురు ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
News March 24, 2025
BREAKING: తండ్రైన స్టార్ క్రికెటర్

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ IPL మ్యాచ్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.