News August 9, 2024

విడాకుల అనంతరం చైతూ ఎంతో బాధపడ్డాడు: నాగార్జున

image

విడాకుల అనంతరం నాగచైతన్య ఎంతో బాధపడ్డారని అతని తండ్రి నాగార్జున చెప్పారు. చైతూ-శోభితా <<13805492>>నిశ్చితార్థంతో<<>> ప్రస్తుతం తాము సంతోషంగా ఉన్నామన్నారు. ఈ వేడుకపై ఓ ఇంగ్లిష్ వెబ్‌సైటుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘విడాకుల అనంతరం బాధను చైతూ ఎవరితోనూ పంచుకోలేదు. నా కుమారుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. పెళ్లికి సమయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.

Similar News

News November 19, 2025

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

image

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్‌ ఇష్యూస్‌ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్‌&డైలాగ్‌ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News November 19, 2025

అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

image

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.