News June 29, 2024
SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. SBIలోని మరో ఇద్దరు ఎండీలు అశ్వినీ కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లనూ పరిశీలించిన కేంద్రం చివరికి శెట్టిని ఖరారు చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా స్థానాన్ని శ్రీనివాసులు భర్తీ చేయనున్నారు. కాగా శ్రీనివాసులు శెట్టికి SBIలో 36ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.
Similar News
News July 11, 2025
ఒక్క MLA అయినా రైతులను పరామర్శించాడా?: పేర్ని నాని

AP: చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లపై మంత్రులు అధికారులు తలో మాట చెబుతున్నారని ఆరోపించారు. ‘మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా? రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటే అడ్డుకుంటారా? కొంతమందికి కూలీ ఇచ్చి మరీ జగన్‌ను తిట్టిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News July 11, 2025
బీసీలతో కవితకు ఏం సంబంధం?: మహేశ్ గౌడ్

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తమ <<17024394>>విజయమని <<>>BRS MLC కవిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. ‘బీసీ రిజర్వేషన్లతో కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి జనం నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు? ఇది రాహుల్ ఎజెండా, రేవంత్ నిబద్ధత’ అని ఆయన స్పష్టం చేశారు.
News July 11, 2025
హువాంగ్.. నీ జీవితం ఎందరికో స్ఫూర్తి!

Nvidia కంపెనీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో సంస్థ CEO జెన్సెన్ హువాంగ్ పేరు మార్మోగుతోంది. ఈయన తైవాన్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఐదేళ్ల వయసులో ఈయన కుటుంబం థాయ్‌లాండ్‌కు వలస వెళ్లగా అక్కడ సామాజిక అశాంతి ఏర్పడింది. దీంతో ఆయన తన అన్నయ్యతో కలిసి USకు వెళ్లారు. అక్కడ స్కూళ్లో వివక్షకు గురై టాయిలెట్లు శుభ్రం చేశారు. ఈ సవాళ్లు, అనుభవాలు హువాంగ్‌లో మరింత కసిని పెంచి ఈ స్థాయికి చేర్చాయి.