News May 11, 2024
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో సవాళ్లు! – 2/2

‘సాధారణ కరెంట్ వాడినందుకు యూనిట్‌కు రూ.8 ఛార్జ్ చేస్తున్నారు. సౌర విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి అయితే రూ.1.5నే చెల్లిస్తున్నారు’ అని ఓ వినియోగదారుడు తెలిపారు. సబ్సిడీలో సోలార్ రూఫ్‌టాప్స్‌కు బ్యాటరీ ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేదు. దీంతో కరెంటు కోతలు ఉన్న ప్రాంతాల్లో సోలార్ రూఫ్‌టాప్స్ ఎక్కువసేపు పనిచేయలేకపోతున్నాయట. వీటి తయారీ/ఏర్పాటుపై వర్కర్లకు తగిన ట్రైనింగ్ కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News February 11, 2025
ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.
News February 11, 2025
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

AP: అల్లూరి(D) మారేడుమిల్లి(M) తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. <<15414061>>ఆల్బెండజోల్ ట్యాబ్లెట్<<>>(నులిపురుగుల నివారణ మాత్ర) వికటించి నాలుగేళ్ల చిన్నారి రస్మిత కన్నుమూసింది. అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్న బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
News February 11, 2025
సూపర్ హిట్ వెబ్‌సిరీస్ సీక్వెల్ రెడీ

ఐశ్వర్యా రాజేశ్, కథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సుడల్: ది వర్టిక్స్’ సీక్వెల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2022లో విడుదలై పార్ట్-1 సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పుష్కర్-గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్ IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.