News December 18, 2024

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్

image

TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ TPCC ఇవాళ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా కాంగ్రెస్ MPలు, MLAలు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగినప్పటి నుంచి ప్రధాని అక్కడ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

Similar News

News January 25, 2025

ఈ-కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

image

AP: గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు Dy CM పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను వాడకపోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నట్లు నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. RBI గైడ్‌లైన్స్ ప్రకారం కార్డులకు ఏడాది పరిమితి ఉండాలి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చాక KYC లింక్ అయిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి’ అని స్పష్టం చేశారు.

News January 25, 2025

విజయసాయి బీజేపీలో చేరడం లేదు: పురందీశ్వరి

image

AP: విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. ‘విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే VSR అన్నారు’ అని గుర్తుచేశారు.

News January 25, 2025

ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి!

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆసుపత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆసుపత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.