News June 17, 2024
సచివాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయింపు

AP: సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Similar News
News November 11, 2025
22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు: మంత్రి సత్యకుమార్

APలో 39L మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 22,861మందిలో సర్వైకల్, 9,963మందిలో బ్రెస్ట్, 26,639మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించామన్నారు. వీరిని బోధనాస్పత్రుల్లోని ఆంకాలజిస్టులు మరోసారి పరీక్షించి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందిస్తారని చెప్పారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మళ్లీ స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.
News November 11, 2025
EXIT POLLS: బిహార్‌లో NDAకే పట్టం!

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.


