News June 17, 2024
సచివాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయింపు
AP: సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Similar News
News October 12, 2024
తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.
News October 12, 2024
20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్
హరియాణా ఎన్నికల ఫలితాల విషయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై EC విచారణ జరుపుతుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కౌంటింగ్‌కి ఉపయోగించిన EVMలు, వాటి బ్యాటరీ సామర్థ్యాలపై కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారని, అక్రమాలు జరిగిన EVMలను సీల్ చేయాల్సిందిగా ఆయన కోరారు.
News October 12, 2024
అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు
1911: భారత మాజీ క్రికెటర్ విజయ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ జననం