News August 12, 2025
రేపు చర్చలకు ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఛాంబర్ లేఖ

వేతనాల పెంపు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు తెలుగు ఫిల్మ్ <<17371616>>ఛాంబర్<<>> లేఖ రాసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని కోరింది. సమావేశానికి ఎంతమంది వస్తారో తెలియజేయాలని పేర్కొంది. నూతన వేతనాలు, పని పరిస్థితులపై చర్చించనుంది.
Similar News
News April 16, 2026
సింగరాయకొండ: పేదింటి విద్యా కుసుమం కిరణ్‌కు జిల్లా ఫస్ట్

పేదింటి విద్యా కుసుమంగా నిలిచిన సింగరాయకొండకు చెందిన కత్తి కిరణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం MPCలో 1000లో 975 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. తల్లిదండ్రులు హైదరాబాదులో కూలి పనులు చేస్తుండగా, నాయనమ్మ వద్ద ఉండి చదివిన కిరణ్ కష్టపడి ఈ విజయాన్ని సాధించాడు. అతని సాధనకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
News April 16, 2026
సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఆయనకు గాయాలయ్యాయని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోకుంటే మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
News April 16, 2026
ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.


