News February 26, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోర్ చేసిన అఫ్గాన్

image

ఇంగ్లండ్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్‌‌తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Similar News

News March 15, 2025

రోజూ సాయంత్రం వీటిని తింటున్నారా?

image

చాలామందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. అలా అని ఏదిపడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెనంపై వేయించిన శనగలు తింటే పోషకాలు అందుతాయి. ఉడకపెట్టిన మొక్కజొన్న తింటే ఫైబర్ లభిస్తుంది. బాదం పప్పు, నల్లద్రాక్ష, పిస్తా, వాల్‌నట్స్, పండ్లు వంటివి తింటే ప్రొటీన్లు లభిస్తాయి. నూనెలో ముంచి తీసిన బజ్జీలు, పునుగులు, పకోడీ వంటివి తింటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు.

News March 15, 2025

గెలవక ముందు జనసేనాని, గెలిచాక ‘భజన’ సేనాని: ప్రకాశ్ రాజ్

image

నిన్న రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన <<15763560>>మాటలపై<<>> నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా? అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టుల్ని ట్వీట్‌కి జత చేశారు.

News March 15, 2025

హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్

image

AP: తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చన్నారు.

error: Content is protected !!