News January 22, 2025
CHAMPIONS TROPHY: పాకిస్థాన్‌కు మరో షాక్?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ పాకిస్థాన్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్, కెప్టెన్ల ఫొటో షూట్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం. రోహిత్ కోసమే ఓపెనింగ్ సెర్మనీ వేదిక మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా స్టేడియాల మరమ్మతులు ఇంకా ఫినిష్ చేయలేక పాక్ కిందా మీదా పడుతోంది.
Similar News
News February 16, 2025
IPL-2025 క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ ఎక్కడంటే?

IPL-2025లో కీలక మ్యాచ్‌లకు HYD, కోల్‌కతా వేదికలు కానున్నాయి. క్వాలిఫయర్-1 మే 20న, ఎలిమినేటర్ మే 21న HYDలో జరగనున్నాయి. క్వాలిఫయర్-2 మే 23న, ఫైనల్ మే 25న కోల్‌కతాలో నిర్వహించనున్నారు. క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన టీంకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతుంది.
News February 16, 2025
18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.
News February 16, 2025
ఏసీ గదులను వదిలేందుకు అధికారులు ఇష్టపడట్లేదు: సీఎం రేవంత్

TG: ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని CM రేవంత్ అన్నారు. అయితే కొందరు AC గదులను వదిలేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు. HYDలో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా వాటిని సమర్థంగా అమలు చేసేది అధికారులేనని తెలిపారు. వాళ్లు చూపే నిబద్ధతను బట్టి పథకాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.