News February 19, 2025
నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ నేటి నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లా, న్యూజిలాండ్, పాక్ ఉండగా గ్రూప్-బిలో అఫ్గాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇరు గ్రూపుల్లోని తొలి రెండు జట్లు సెమీస్కు చేరతాయి. భారత్ తొలిమ్యాచ్ రేపు బంగ్లాతో ఆడనుంది.
Similar News
News February 21, 2025
మహమ్మద్ షమీ ‘ది వారియర్’

మహమ్మద్ షమీ ఓటమిని ఒప్పుకోరు. గతేడాది కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితి నుంచి CT తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన వరకు తన కృషి పోరాట యోధుడికి ఏ మాత్రం తీసిపోదు. గాయంతో ఏడాదికి పైగా జట్టుకు దూరమైనా, BGTకి సెలక్ట్ కాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్లో రాణించకపోయినా పట్టుదల వదల్లేదు. ఏడాదిలోనే కమ్ బ్యాక్ చేసి బంగ్లాపై 5 వికెట్లు తీశారు. స్లో పిచ్పై రాకెట్ల లాంటి బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
News February 21, 2025
నేను ‘కింగ్’ని.. ట్రంప్ పోస్ట్

US అధ్యక్షుడు ట్రంప్ తనకు తానే రాజుగా ప్రకటించుకున్నారు. ‘CONGESTION PRICING’ను రద్దు చేసి న్యూయార్క్ నగరాన్ని సేవ్ చేశానని చెబుతూ ‘కింగ్’గా అనౌన్స్ చేసుకున్నారు. కాసేపటికే ట్రంప్ తలపై కిరీటం ఉంచి ఎడిట్ చేసిన ఫొటోను WHITE HOUSE ట్వీట్ చేసింది. న్యూయార్క్లో బిజీ టైంలో భారీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లోకి ప్రవేశించే డ్రైవర్లకు 9 డాలర్లు ఛార్జ్ చేస్తారు. దీన్నే ‘CONGESTION PRICING’ అంటారు.
News February 21, 2025
55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.