News November 12, 2024

దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

image

పాకిస్థాన్‌లో జరగాల్సిన <<14588299>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> దక్షిణాఫ్రికాకు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు PCB ఒప్పుకోకపోవడంతో SAలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

Similar News

News July 10, 2025

తొలి క్వార్టర్‌: TCS‌కు రూ.12,760 కోట్ల లాభం

image

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్‌(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డిక్లేర్ చేసింది.

News July 10, 2025

జనగణన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

News July 10, 2025

KCRకు వైద్య పరీక్షలు పూర్తి

image

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.