News June 18, 2024
ఈ నెల 20 నుంచి 24 వరకు రీవెరిఫికేషన్‌కు ఛాన్స్

ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ <<13462523>>ఫలితాల్లో<<>> 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవెరిఫికేషన్‌కు ఈ నెల 20 నుంచి 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 12, 2025
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: KTR

TG: పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలు కూడా గెలవకపోవడం, అనేకచోట్ల 10, 20 ఓట్లతో బయటపడటం చూస్తుంటే కాంగ్రెస్ కౌంట్‌డౌన్ పల్లెల నుంచే మొదలైనట్లు అర్థమవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆ పార్టీ అధికారంలో ఉన్నా పైసా అభివృద్ధి జరగదని ప్రజలు డిసైడ్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో INC పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
News December 12, 2025
విశాఖ కాగ్నిజెంట్‌లో 25000 మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్

AP: విశాఖలో నెలకొల్పుతున్న తమ సంస్థలో 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని IT సంస్థ కాగ్నిజెంట్ CEO రవికుమార్ వెల్లడించారు. విశాఖలో సంస్థను ఏర్పాటుచేయడం తన సొంత ఇంటికి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. కాగా సంస్థ 8వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ముందు ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అవకాశాల్ని పెంచింది. సంస్థ భవనాలకు CM CBN శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో CEO దీన్ని ప్రకటించారు.
News December 12, 2025
764పోస్టులు.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

<


