News June 18, 2024

ఈ నెల 20 నుంచి 24 వరకు రీవెరిఫికేషన్‌కు ఛాన్స్

image

ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ <<13462523>>ఫలితాల్లో<<>> 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవెరిఫికేషన్‌కు ఈ నెల 20 నుంచి 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News January 18, 2026

GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఖమ్మం: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు: కమిషనర్

image

సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. హెలిప్యాడ్, కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.