News April 7, 2024

చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

image

AP: ఎన్నికల ప్రచారంలో NDA కూటమి దూకుడు పెంచనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కలిసి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీళ్ల ప్రచారం ఉండే ఛాన్సుంది.

Similar News

News January 8, 2025

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News January 8, 2025

బూమ్ బూమ్ బీరు తీసుకొచ్చేందుకు కుట్ర: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలోకి లోకల్ బ్రాండ్స్ బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. అందుకే కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్ల సరఫరా నిలిపివేసిందని సర్కార్‌పై మండిపడ్డారు. ‘బీర్ల నిలిపివేతపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వీటి సరఫరాను నిలిపేశారు. UBLకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

News January 8, 2025

కోహ్లీ నాకు దేవుడు: కోన్‌స్టాస్

image

విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.