News January 8, 2025
కోహ్లీ నాకు దేవుడు: కోన్‌స్టాస్
విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.
Similar News
News January 18, 2025
సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 18, 2025
పవన్ ఆఫీస్‌పై డ్రోన్.. డీజీపీకి ఫిర్యాదు
AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 18, 2025
తిరుమల, తిరుపతిలో అపచారాలు.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
AP: తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. అన్ని ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనున్నారు. తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, రూ.300 టికెట్ల స్కామ్, తాజాగా కొండపై ఎగ్ బిర్యానీ కలకలం రేపిన విషయం తెలిసిందే.