News September 24, 2024
మోదీపై చంద్రబాబు, పవన్ ప్రశంసల వర్షం

అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని భారత్కు విచ్చేస్తోన్న ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. భారత స్థానాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. దేశంలో అందరినీ ఏకం చేయడంలో ప్రధాని కృషి అభినందనీయమన్నారు. మరోవైపు భారత సామర్థ్యం, విజన్ను మోదీ ప్రపంచ వేదికపై ప్రదర్శించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
MDK: పెన్షన్ల పెంపు ఇంకెన్నడో ?

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ప్రచార సభలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావొస్తున్నా పెన్షన్ పెంపు ముచ్చట లేదు. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 వరకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.


