News September 24, 2024
మోదీపై చంద్రబాబు, పవన్ ప్రశంసల వర్షం
అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని భారత్‌కు విచ్చేస్తోన్న ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. భారత స్థానాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. దేశంలో అందరినీ ఏకం చేయడంలో ప్రధాని కృషి అభినందనీయమన్నారు. మరోవైపు భారత సామర్థ్యం, విజన్‌ను మోదీ ప్రపంచ వేదికపై ప్రదర్శించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.
News October 6, 2024
PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం
తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
News October 6, 2024
రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?
సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.