News December 4, 2024
వెలగపూడిలో 5 ఎకరాలు కొన్న చంద్రబాబు

AP: రాజధాని అమరావతిలో శాశ్వతంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు 5 ఎకరాల స్థలం తీసుకున్నారు. దీనికి నాలుగు వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీవోల రెసిడెన్సీలు ఈ ప్లాట్‌కు సమీపంలోనే ఉన్నాయి. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం ఉపయోగిస్తారు.
Similar News
News February 9, 2026
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 9, 2026
స్కాములతో రేవంత్ చరిత్రలో నిలిచిపోతారు: హరీశ్

TG: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులో ఉందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను BRS MLA హరీశ్ రావు ఖండించారు. తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ బీజేపీతో కలవలేదన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం స్కాములతో చరిత్రలో నిలిపోతారు’ అని విమర్శించారు.
News February 9, 2026
NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<


