News August 30, 2024

చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: జగన్

image

AP: <<13972426>>గుడ్లవల్లేరు<<>> ఘటనపై YCP చీఫ్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. విపక్ష పార్టీపై బురదజల్లుడు కార్యక్రమాలతో పాలన గాలికొదిలేశారు. స్కూళ్లలో కలుషితాహారంతో వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టినట్లుగా వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 21, 2024

‘లాల్‌బాగ్‌చా రాజా’కు రూ. కోట్లాది కానుకలు

image

ముంబైలోని ‘లాల్‌బాగ్‌చా రాజా’ వినాయకుడిని నగరంలో అత్యంత ఘనంగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గణేశ్ చతుర్థికి భక్తులు ఆయనకు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. మొత్తం రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండి స్వామివారికి సమకూరాయని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ స్వామి నిమజ్జన వేడుకలో అంబానీలు సహా వేలాదిమంది భక్తులు పాల్గొనడం విశేషం.

News September 21, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➣AP: అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు: సీఎం చంద్రబాబు
➣TG:సింగరేణి కార్మికులకు రూ.1.90లక్షల చొప్పున దసరా బోనస్: CM రేవంత్
➣AP:కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: YS జగన్
➣భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు: పవన్
➣జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈవో
➣TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
➣ఉచితాలు వద్దు అనే మార్పు రావాలి: ఈటల
➣కాళేశ్వరం కింద పండే పంటలపై KCR పేరుంటుంది: హరీశ్‌

News September 21, 2024

లాలూ కుటుంబానికి మ‌రిన్ని చిక్కులు

image

ల్యాండ్ ఫ‌ర్ జాబ్‌ కేసులో కేంద్ర‌ రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు CBI కాపీ సమర్పించింది. ఈ కేసులో CBI ఇప్ప‌టికే లాలూ, అయ‌న కుటుంబ స‌భ్యుల పాత్ర‌పై ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ప్రాసిక్యూష‌న్‌కు రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి లభించడంతో ఛార్జిషీట్‌ను కోర్టు ఇప్పుడు స‌మీక్షించి వారిపై అభియోగాలు మోపనుంది.