News August 19, 2024

చంద్రబాబూ.. వెలిగొండ R&Rపై దృష్టిపెట్టండి: జగన్

image

AP: ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టట్లేదని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. ‘కరోనా కష్టకాలంలోనూ మేం 2021లో ప్రాజెక్టు టన్నెల్-1, 2024లో టన్నెల్-2 పూర్తి చేశాం. ఇంకా R&R(రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌)కు రూ.1,200 కోట్లు చెల్లిస్తే నీరు నిల్వ చేయొచ్చు. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచించాలి’ అని Xలో డిమాండ్ చేశారు.

Similar News

News January 31, 2026

APPLY NOW: IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు

image

<>ఇండియన్<<>> ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అగ్నిపథ్ స్కీం కింద వీటిని భర్తీ చేయనున్నారు. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనవరి 1, 2006-జులై1,2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. వెబ్‌సైట్: https://iafrecruitment.edcil.co.in

News January 31, 2026

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

News January 31, 2026

పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్ వచ్చేస్తోంది!

image

పంటి ఎనామిల్‌ను తిరిగి పెంచే కొత్త ప్రొటీన్ జెల్‌ను UKలోని నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ జెల్ పంటిపై రాస్తే అది లాలాజలం నుంచి కాల్షియం, ఫాస్ఫేట్‌లను గ్రహించి దంతాన్ని మళ్లీ సహజంగా మొలిపిస్తుంది. వారంలోనే మార్పు కనిపిస్తుందని బ్రషింగ్, నమలడాన్ని ఇది తట్టుకుంటుందని ప్రయోగాలు నిరూపించాయి. దీని క్లినికల్ ట్రయల్స్ 2026లో ప్రారంభం కానున్నాయి.