News August 19, 2024

చంద్రబాబూ.. వెలిగొండ R&Rపై దృష్టిపెట్టండి: జగన్

image

AP: ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టట్లేదని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. ‘కరోనా కష్టకాలంలోనూ మేం 2021లో ప్రాజెక్టు టన్నెల్-1, 2024లో టన్నెల్-2 పూర్తి చేశాం. ఇంకా R&R(రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌)కు రూ.1,200 కోట్లు చెల్లిస్తే నీరు నిల్వ చేయొచ్చు. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచించాలి’ అని Xలో డిమాండ్ చేశారు.

Similar News

News September 20, 2024

ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం: CM

image

AP: ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రకాశం(D) మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘MLAలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం అందించాలి. ప్రస్తుతం ఏపీ వెంటిలేటర్‌పై ఉంది. 21 మంది MPలను గెలిపించడంతో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దీంతో APకి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.

News September 20, 2024

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

image

AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.

News September 20, 2024

ప్చ్.. మళ్లీ తక్కువ రన్స్‌కే ఔటైన రోహిత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో జాకీర్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్‌కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.