News April 28, 2024

చంద్రబాబుకు తలలో చిప్ లేదు: సజ్జల

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014-19 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిది. కానీ దానిని చంద్రబాబు చిత్తుకాగితంతో సమానంగా చూస్తున్నారు. మేం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూస్తున్నాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 3, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.

News January 3, 2025

దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 3, 2025

వచ్చేవారం భారత్‌కు జేక్ సలివాన్

image

US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వచ్చేవారం భారత్‌కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(iCET) ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. AI, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. కాగా.. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సలివాన్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.